News March 13, 2025

భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

image

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

Similar News

News March 18, 2025

దేవనకొండలోకి నో ఎంట్రీ: CI వంశీనాథ్

image

గద్దెరాళ్ల దేవర రేపటి నుంచి జరగనుంది. ఈక్రమంలో దేవనకొండ సీఐ వంశీనాథ్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గద్దెరాళ్ల రోడ్డులోనే వాహనాలు రావాలని చెప్పారు. దేవనకొండ గ్రామంలోకి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేవరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 

News March 18, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ఆదోనిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సందడి
➤ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ ఆదోనిలో మృతదేహంతో ఆందోళన
➤ క్లస్టర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బసవరావు
➤ పదో తరగతి పరీక్షలు.. తొలిరోజే ఇద్దరు డిబార్
➤ పెద్దకడబూరు: ‘భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి’
➤ ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో గళం

News March 17, 2025

కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.

error: Content is protected !!