News April 3, 2025
భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
Similar News
News November 27, 2025
రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామంలో కిరాణా షాపు నిర్వాహకుడు దావుద్ కుమారుడు అయిన అబ్దుల్ ఆదివారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రాజవొమ్మంగి శివారులో టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News November 27, 2025
KNR: పంచాయతీ పోరు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్థబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉన్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. KNRలో 316, JGTLలో 385, SRCLలో 260, PDPLలో 263 జీపీలు ఉన్నాయి.
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


