News June 29, 2024

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుపైనే నా తొలిసంతకం: మంత్రి సుభాష్

image

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వ బృందం శనివారం మంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని హామీ ఇచ్చారు.

Similar News

News October 28, 2025

తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

image

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News October 28, 2025

తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.