News December 18, 2024
భవానీపట్నం- విశాఖపట్నం ప్యాసింజర్ రైలు గమ్యం కుదింపు
భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల దృష్ట్యా భవానీపట్నం- విశాఖపట్నం ప్రత్యేక రైలు గమ్యాన్ని రాయగడ స్టేషన్ వరకు పరిమితం చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే సీనియర్ డీసీఎం, సందీప్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెం.08503/04, భవానీపట్నం-విశాఖపట్నం- భవానీపట్నం పాసెంజర్ 3.01.2025 నుండి 9.01.2025 వరకు రాయగడ-విశాఖపట్నం స్టేషన్ ల మధ్య రాకపోకలు సాగిస్తుందని తెలియజేసారు.
Similar News
News January 21, 2025
విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్
విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.
News January 21, 2025
జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌కు బదిలీ
జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సీడీఎంఏకు బదిలీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో జీవీఎంసీ కమిషనర్‌గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛార్జ్ తీసుకున్న కేవలం ఐదు నెలలలోపే ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ కేటాయించలేదు.
News January 20, 2025
పాడేరు ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం
పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏసుప్రభు విగ్రహం మలుపు వద్ద రైలింగ్ ఢీ కొట్టి నిలిచిపోయింది. రైలింగ్ లేకపోతే పెద్ద లోయలో బస్సు పడేదని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొంతసేపు బస్సు నిలిచింది. మలుపులో స్టీరింగ్ పట్టేయడంతో నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టింది.