News February 12, 2025
భవిష్యత్తు మీదే:ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739282555510_19518427-normal-WIFI.webp)
భవిష్యత్తు మీదే అని మహబూబ్ నగర్ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10వతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 12, 2025
MBNR: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333645143_1292-normal-WIFI.webp)
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.
News February 12, 2025
MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739329256213_1292-normal-WIFI.webp)
లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.
News February 12, 2025
MBNR: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324207553_1292-normal-WIFI.webp)
ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.