News September 12, 2024

భాకరాపేట ప్రమాదం మృతుల వివరాల గుర్తింపు

image

భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్‌కు చెందిన రమేశ్ మూర్తి(34), మంజునాథ(38), ముని వెంకట్ రెడ్డి(55), మరి కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. కారులో తిరిగి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న తేజస్ కుమార్(33), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అల్లావుద్దీన్(30) తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News December 19, 2025

చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

image

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.

News December 19, 2025

చిత్తూరు: అర్జీల పరిష్కారంలో వెనుకబాటు.!

image

PGRS వినతుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా వెనుకబాటులో ఉంది. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు నివేదిక వెలువడింది. నిర్దేశించిన గడువులో వాటిని పరిష్కరించకపోవడంతో ఈ విభాగంలో జిల్లా 7.27%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అర్జీల రీ ఓపెన్‌లో 14.52 శాతంతో మూడో స్థానంలో ఉంది. LPM తిరస్కరణలో 28.85 శాతంతో మూడో స్థానంలో ఉంది.

News December 19, 2025

చిత్తూరు: 1447 మంది గైర్హాజరు.!

image

చిత్తూరు జిల్లాలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం పాఠశాలల్లో వందరోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 1447 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1529 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తరగతులకు 13,762 మంది మాత్రం హాజరవుతున్నట్టు వెల్లడించారు. అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.