News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొండ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 15, 2026

‘శివోహం జాగరణ’లో సీఎం: పటిష్ట భద్రత

image

మహాశివరాత్రి సందర్భంగా నంబూరు వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన ‘శివోహం జాగరణ’కు సీఎం హాజరయ్యారు. ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారియా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News February 15, 2026

బాపట్లలో పండగ పూట విషాదం

image

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News February 15, 2026

మహబూబాబాద్‌లో 144 సెక్షన్: ఎస్పీ

image

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ (163 BNSS) అమల్లో ఉంటుందని ఎస్పీ డా. శబరిష్ తెలిపారు. నలుగురికి మించి గుంపులుగా తిరగడం, విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.