News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొడ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 18, 2025
పామిడిలో తండ్రిని చంపిన కొడుకు

పామిడిలోని బెస్తవీధిలో తండ్రిపై కొడుకు రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో తండ్రి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
సిరిసిల్ల కలెక్టర్పై వారెంట్ జారీ..!

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది బొమ్మన అర్జున్ తెలిపారు. ఏమైందంటే.. మిడ్ మానేరులో ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా దీనిపై కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా వివరణ కోసం కోర్టుకూ హాజరుకాలేదు. దీంతో ఆయనపై వారెంట్ జారీ అయింది.
News September 18, 2025
మాసాయిపేట: ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

మెదక్ జిల్లా మాసాయిపేటలో హైవే-44పై జరిగిన <<17746368>>రోడ్డు ప్రమాద<<>> ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న UPకి చెందిన రాజ్ కుమార్ పాల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.