News February 8, 2025

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొడ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

BREAKING: బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ రైడ్స్

image

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులకు రైడ్స్ చేపట్టారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. అద్దెకు ఉండే ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.

News April 17, 2026

తిరుచానూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు

image

తిరుచానూరులో కొత్త సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పనిభారం, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రేణిగుంట, తిరుపతి రూరల్ కార్యాలయాల పరిధిని విభజించి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేణిగుంట నుంచి 3, తిరుపతి రూరల్ నుంచి 19 గ్రామాలను కొత్త కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తారు. దీంతో సేవలవేగం, పారదర్శకత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.