News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాళిక రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాళికంగా రద్దుచేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.
Similar News
News November 15, 2025
వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 15, 2025
బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి కొండా

మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం జాతరలో అమ్మవారి గద్దెల చుట్టూ భక్తులు క్యూ-లైన్లలో సాఫీగా వెళ్లేందుకు తయారు అవుతున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాను సెక్రటేరియట్లో మంత్రి పరిశీలించారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, జాతర ఏర్పాట్ల విషయంలో ఏ విధంగానూ రాజీ పడొద్దని తెలిపారు.


