News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో భువనగిరి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర పిలుపునిచ్చారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీలో అవగాహన సదస్సు జరిగింది. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. గడ్డి, పొదల్లోకి వెళ్లేటప్పుడు శరీరం కప్పుకునే దుస్తులు ధరించాలని, నేలపై నేరుగా కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి చేయకూడదని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నారు.
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
News December 7, 2025
ములుగు: రెండో విడతలో 11 జీపీలు ఏకగ్రీవం

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న 52 గ్రామ పంచాయతీల్లో 11 పంచాయతీ కార్యవర్గాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. గుర్తూరు తండా, ముద్దునూరుతండా, అంకన్నగూడెం, బంజరుపల్లి, జగ్గన్నపేట, కొత్తూరు, పెగడపల్లి, రాయినిగూడెం, అడవి రంగాపురం, నర్సింగాపూర్, తిమ్మాపూర్ గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.


