News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో భువనగిరి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 15, 2025
ఆ గ్రామానికి వెళ్లాలంటే వీసా కావాలా?: తోపుదుర్తి

రాప్తాడు నియోజకవర్గంలోని పోలీసులు పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. తనను సిద్ధరాంపురం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఆ గ్రామం పాకిస్థాన్‌లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రాప్తాడు సీఐ, రామగిరి ఎస్‌ఐ పరిటాల కోసం పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
News March 15, 2025
SRPT: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం (నేడు) నుంచి సూర్యాపేట జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
News March 15, 2025
NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.