News December 22, 2024
భామిని : ఆటో-కారు ఢీ.. ఐదుగురికి గాయాలు

పాతపట్నం మండలం కొరసవాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారు మన్యం జిల్లా భామిని (M) లివిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాతపట్నం నుంచి నవతల వైపు వస్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Similar News
News November 28, 2025
రోడ్డు ప్రమాద బాధితులకి నగదు రహిత వైద్యం: VZM కలెక్టర్

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అందించిన నగదు రహిత వైద్య సదుపాయం పై శుక్రవారం రాత్రి దేశ వ్యాప్త వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో విజయనగరం జిల్లా నుంచి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని MORDH అధికారులు వివరించారు.
News November 28, 2025
పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


