News March 10, 2025

భారత్ విక్టరీపై కేంద్రమంత్రి బండి ట్వీట్

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమ్ఇండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ది మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News October 16, 2025

కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్‌పై మందుబాబుల ఆందోళన.!

image

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్‌’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్‌లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

News October 16, 2025

విశాఖ: దీపావళి వేళ భద్రత కట్టుదిట్టం

image

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో రైళ్లలో క్రాకర్లు తీసుకెళ్లకుండా నిరోధించడానికి వాల్తేర్ డివిజన్ అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణానికి డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కఠినమైన నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను భద్రతా సిబ్బందికి తెలపాలని కోరారు.

News October 16, 2025

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: ఖరీఫ్ సీజన్‌లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.