News March 10, 2025
భారత్ విజయం.. మంత్రి పొన్నం విషెస్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కప్ విజయం సాధించిన టీమ్ ఇండియాకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. వేములవాడలో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్ విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆద్యంతం జట్టు సమష్టిగా పోరాడుతూ విజయం సాధించిందని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ బృందానికి మంత్రి ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 18, 2025
కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
News September 18, 2025
తిరుపతి: DSC అభ్యర్థులకు గమనిక

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CM చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికన వారంతా రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు ఇవాళ ఉదయం 7గంటలకు చేరుకోవాలని DEO కేవీఎన్ కుమార్ కోరారు. ఫొటో, ఆధార్, కాల్ లెటర్‌తో వస్తే వారిని బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.
News September 18, 2025
NLR: ఒక్క ప్రమాదం.. 4కుటుంబాల్లో విషాదం

సంగం(M) పెరమన ఘోర <<17737459>>ప్రమాదం <<>>పలువురిని రోడ్డున పడేసింది. ఇందుకూరుపేటకు చెందిన భార్యాభర్త శ్రీనివాసులు, లక్ష్మి చనిపోగా వీరి పిల్లలు(9, 6th క్లాస్) అనాథలయ్యారు. శ్రీనివాసులు, రాధ(నెల్లూరు) నిన్న మృతిచెందగా రెండేళ్ల కిందటే వీళ్ల కుమార్తె ఉరేసుకుంది. కుమారుడు శ్యాం అనాథయ్యాడు. శ్రీనివాసులు హోటల్లో పనిచేసే బ్రహ్మయ్య కారు డ్రైవర్‌గా వచ్చి చనిపోగా.. ఇదే ఘటనలో శారమ్మ, బాల వెంగయ్య(వదిన, మరిది) కన్నుమూశారు.