News April 14, 2025
భారత ఆర్చరీ అసోసియేషన్ సభ్యులుగా MHBD జిల్లా వాసి శంకరయ్య

దేశంలో ఆర్చరీ అభివృద్ధి కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వాసి పుట్ట శంకరయ్యను కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా నియమించింది. ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు సాదుల సారంగపాణి, డివైస్ సునీల్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ ఫర్ బాబు, మానుకోట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 28, 2025
శ్రీకాకుళం: ‘రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి’

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఏపీ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అన్నారు. శాసన సభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27,28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.
News November 28, 2025
NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తరుడు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పంపిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదించి, నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డిఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News November 28, 2025
అమరావతిలో 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

అమరావతిలో రెండోవ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16.666.5 ఎకరాల సమీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పల్నాడు (D) అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు కాగా, గుంటూరు (D) తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


