News February 2, 2025

భారత జట్టుకు అభినందనలు: హోం మంత్రి అనిత

image

రెండవ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ అండర్-19 జట్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష మూడు వికెట్లు తీసి 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బౌలింగ్‌లో విశాఖకు చెందిన షబ్నం ఒక వికెట్ తీయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

Similar News

News February 8, 2025

‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు

image

దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్‌, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.

News February 8, 2025

జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం

image

మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 

News February 8, 2025

నల్గొండ: కలెక్టరేట్‌లో పందులు.. 

image

జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయ్. నిత్యం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రదేశాల్లో పందుల బెడద ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!