News February 6, 2025
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్గా హిందూపురం యువకుడు

హిందూపురానికి చెందిన వసంత్ కుమార్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నేపాల్లో జరగనున్న టీ20 సిరీస్లో భారత జట్టు పాల్గొననుంది. ఈ టీమ్కు వసంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఘనంగా సత్కరించారు. విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 5, 2025
చింతపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు

స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. గురువారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో, చింతపల్లి మండలానికి చెందిన 27 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.3కోట్ల 15లక్షల రుణాలు చెక్కును కలెక్టర్ పంపిణీ చేశారు. రుణాలు సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించాలన్నారు.
News December 5, 2025
కరీంనగర్: ‘విదేశాల్లో విద్యపై అవగాహన తరగతులు’

విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవగాహన తరగతులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు డిసెంబర్ 21లోపు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. స్కాలర్షిప్లు, IELTS ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అవగాహన కార్యక్రమంపై పూర్తి సమాచారం కోసం 040-24071178 లేదా 0878-2268686 సంప్రదించవచ్చని డైరెక్టర్ ఎం.రవికుమార్ తెలిపారు.
News December 5, 2025
చిగ్గర్ మైట్ పురుగుతో స్క్రబ్ టైపస్ వ్యాధి: బాపట్ల DMHO

స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO విజయమ్మ చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్క్రబ్ టైపస్ కొత్త రకం కాదన్నారు. జ్వరం, తలనొప్పిని ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు వలన వ్యాధి వ్యాపిస్తుందన్నారు. పురుగు కుట్టినచోట నల్లగా మచ్చలు ఏర్పడతాయన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలన్నారు.


