News October 10, 2024
భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ ఓ శకం: మంత్రి పొంగులేటి

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగం, యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
ఖమ్మం: ‘బీసీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి’

2024–25 విద్యా సంవత్సరానికి బీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఈ-పాస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి.జ్యోతి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఆదాయ, ఆధార్, కుల ధ్రువపత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ జతచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రింట్‌ను కలెక్టరేట్‌లోని కార్యాలయంలో సమర్పించాలని ఆమె సూచించారు.
News November 3, 2025
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.


