News October 10, 2024
భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ ఓ శకం: మంత్రి పొంగులేటి
భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగం, యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.
Similar News
News November 1, 2024
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తుమ్మల భేటీ
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ కు సంబంధించి అంశంపై చర్చించారు. వచ్చే పంట కాలం లోపల నీరు వచ్చే విధంగా పనులు ప్రారంభించి సత్తుపల్లికి నీరు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. కావాల్సిన భూ సేకరణ, ఇతర పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
News November 1, 2024
కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే సహించేది లేదు: మంత్రి తుమ్మల
రాష్ట్ర సచివాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్, మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాట్సాప్ (8897281111) ద్వారా రైతులు సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవకతవకలు జరిగితే సహించేది లేదని తుమ్మల హెచ్చరించారు.
News November 1, 2024
మధిర: లారీ డ్రైవర్‌పై ట్రాన్స్‌జెండర్స్ దాడి.. SI కౌన్సిలింగ్
మధిరలో గురువారం రాత్రి ట్రాన్స్‌జెండర్స్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. మధిర ఎస్ఐ సంధ్య ఈరోజు ఉదయం వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు.