News December 21, 2024
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు
శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చల్ జిల్లా కలెక్టరు గౌతమ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News January 26, 2025
సికింద్రాబాద్: 76వ గణతంత్ర దినోత్సవం.. ముస్తాబైన రైలు నిలయం
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సుందరంగా వెలిగిపోయింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైలు నిలయం ముస్తాబైంది. హైదరాబాద్ డివిజనల్ కార్యాలయం మూడు రంగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మూడు రంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. అటు రైల్వే నిలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ మూడు రంగులతో ముస్తాబైంది.
News January 25, 2025
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
News January 25, 2025
ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.