News July 9, 2024
భారత వాయుసేనలో దరఖాస్తుల ఆహ్వానం

భారత వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు సంబంధించి మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెట్కూరు సీఈవో రమణ తెలిపారు. ఇంటర్, డిప్లొమా పూర్తైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 28వ తేదీ లోగా అందజేయాలని తెలిపారు. అక్టోబరు 18వ తేదీ తర్వాత ఆన్లైన్లో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెట్కూరు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Similar News
News December 20, 2025
నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.
News December 20, 2025
క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.
News December 19, 2025
కర్నూలు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ABCD అవార్డు

ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ATM దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు కర్నూలు జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD) లభించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అవార్డును అందుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.


