News December 15, 2024
భారత సెపక్ తక్రా సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు
ఢిల్లీలో ఆదివారం జరిగిన భారత సెపక్ తక్రా సంఘం ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉన్న జీ.శ్రీనివాసులు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసులు ఎన్నికపట్ల కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు కేఈ జగదీశ్ కుమార్, ఒలంపిక్ సంఘం సీఈఓ విజయకుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు సునీల్, పీఈటీ, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 16, 2025
కర్నూలు జిల్లాలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!
కర్నూలు జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కర్నూలులో కాంపోజిట్ ఫెసిలిటీపై రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే సుమారు 6వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
News January 16, 2025
డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని
YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 16, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుందని, వెంటనే apk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయమంటూ వచ్చే మెసేజులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు కూడా ఎంతో తేలికగా ఆ గేమ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు. నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.