News August 27, 2024
భారత సెపక్ తక్ర జట్టుకు శివకుమార్ ఎంపిక
సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు బ్యాంకాక్లో జరగనున్న కింగ్స్ కప్ సెపక్ తక్రా పోటీలకు కర్నూలు నుంచి శివకుమార్ ఎంపికయ్యారు. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శివ కుమార్ గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
Similar News
News January 15, 2025
కర్నూలు: కవలల ఇంట సంక్రాంతి కాంతులు
ఒకేసారి కవలలు అంటే కాస్త ఆశ్చర్యం, కానీ రెండోసారి కవల పిల్లలంటే అద్భుతమే అని చెప్పాలి. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడపిల్లలు, రెండోసారి ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయిల పేర్లు స్నేహ, శ్వేత కాగా అబ్బాయిల పేర్లు అఖిల్, నిఖిల్గా నామకరణం చేశారు. కవల పిల్లలతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
News January 15, 2025
పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి
కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.
News January 15, 2025
నంద్యాల: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా?
కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అంబటి రామచంద్రారెడ్డి, శివగంగ దంపతుల కుమారుడు శివరాఘవరెడ్డి(25) అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాఘవరెడ్డి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.