News August 27, 2024
భారత సెపక్ తక్ర జట్టుకు శివకుమార్ ఎంపిక

సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు బ్యాంకాక్‌లో జరగనున్న కింగ్స్ కప్ సెపక్ తక్రా పోటీలకు కర్నూలు నుంచి శివకుమార్ ఎంపికయ్యారు. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర సెపక్ తక్రా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శివ కుమార్ గతంలో అనేక జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
Similar News
News October 23, 2025
ఈనెల 25న కర్నూలులో జాబ్ మేళా

ఈ నెల 25న కర్నూలులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి బుధవారం తెలిపారు. ఈ మేళాలో ఆరంజ్ ఫైనాన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఫొటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు. www.ncs.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News October 23, 2025
3వ విడత రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి: సీసీఎల్ఏ

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం ఇళ్లు లేని వారికి ఇళ్లు కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు. 3వ విడత రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ సంబంధిత సమస్యలను సమీక్షించాలని సూచించారు. దీనికి సంబంధించిన నివేదిక సమర్పిస్తామని కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు.
News October 22, 2025
2 కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు: జిల్లా జడ్జి

రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల కలెక్టర్లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.