News June 4, 2024
భారీ ఆధిక్యంలో దగ్గుబాటి పురందీశ్వరి

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కూటమి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 30,743 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు పురందీశ్వరి ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదవ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
Similar News
News November 17, 2025
ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.