News July 4, 2024

భారీ ప్రాజెక్టులతో దీటైన నగరంగా HYD!

image

HYD నగరాన్ని ప్రపంచంలోనే దీటైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓవైపు RRR(రీజినల్ రింగ్ రోడ్), మరోవైపు మూసి రివర్ డెవలప్‌మెంట్, ఇంకోవైపు శంషాబాద్ పరిసరాల్లో 1000 ఎకరాల్లో ఫార్మసిటీ హబ్, వీటన్నింటికి తోడు HYD ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా మార్చే ప్రాజెక్టులతో HYD నగర రూపురేఖలే మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News

News October 19, 2025

హైదరాబాద్‌: పిల్లల్లో పెరుగుతున్న అలర్జీలు

image

HYDలో పిల్లల్లో అలర్జీలు అధికంగా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమంది పిల్లల్లో సుమారు ఆరుగురికి అలర్జిక్ రైనైటిస్ (తుమ్ములు, ముక్కు కారటం), బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు) వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ​ఇంట్లో, బయట ఉండే వాతావరణ మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News October 19, 2025

RR: భారీగా తగ్గిన అప్లికేషన్స్.. గడుపు పొడిగింపు

image

వైన్స్ టెండర్ల గడువు ఈనెల 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు సుమారు 13,300పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సరూర్‌నగర్ డివిజన్‌లో 138 వైన్స్ షాపులకు 7,000, శంషాబాద్ డివిజన్‌లో 111 షాపులకు 6,300లకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ.4.32 కోట్ల ఆదాయం సమకూరింది.

News October 19, 2025

నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

image

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.