News February 25, 2025
భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.
Similar News
News March 25, 2025
పెద్దపల్లి బైపాస్ సిద్ధం.. సమయం ఆదా!

పెద్దపల్లి రైల్వే బైపాస్‌కు రంగం సిద్ధమైంది. కాజీపేట – బల్లార్షా – పెద్దపల్లి – నిజామాబాద్‌ను కలిపేలా నిర్మించిన రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనులు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఉగాది నుంచి ఈ లైన్ అందుబాటులోకి రానుంది. ఇకపై ప్రతీ రైలుకు 40 నిమిషాలు సమయం ఆదా కానుంది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 25, 2025
జగిత్యాల: స్కాలర్ షిప్‌నకు అప్లై చేసుకోండి

జగిత్యాల జిల్లాలోని డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో పీజీ చేయడానికి రూ.20 లక్షల స్కాలర్‌షిప్ కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత కలవారు మే 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్‌పోర్ట్, వీసా కల్గిన ఎస్సీ విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
News March 25, 2025
న్యూజిలాండ్‌లో భూకంపం

న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 7.13 గంటలకు పశ్చిమ తీరంలోని సౌత్ ఐలాండ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.