News September 2, 2024
భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 4/4
*ఇబ్రహీంపట్నం: వేములకుర్తిలో ఇంటిపై పిడుగు.
*బెజ్జంకి: తోటపల్లిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.
*గంగాధర: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.
*వెల్గటూర్: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
*ధర్మపురి: భారీ వర్షాలకు.. అప్రమత్తమైన పోలీసులు హెచ్చరికలు జారీ.
*పెగడపల్లి: తెగిపడిన రోడ్లు.. బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలు.. ఆగిన రైతుల పనులు.
Similar News
News September 14, 2024
KNR: స్కాలర్‌షిప్స్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
2024-25 విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని SCDD కరీంనగర్ జిల్లా ఉపసంచాలకులు నాగలేశ్వర్ కోరారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ సహకరించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు అర్హులన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గడువు తేదీ 31.12.2024.
News September 14, 2024
రామగుండంలో వందేభారత్ హాల్ట్
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
News September 14, 2024
KNR: నిమజ్జనం రోజున వైన్స్ విక్రయాలు బంద్
ఈనెల 16న గణేష్ నిమజ్జనం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా షాపులు తెరుచుకుంటాయి.