News September 1, 2024
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి: మంత్రి కొండా సురేఖ

అల్పపీడన ద్రోణితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అన్నారు. విద్యుత్ పోల్సు ముట్టుకోరాదని తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దన్నారు. సహాయం కొరకు 040-21111111 మరియు 9000113667 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి సురేఖ పోస్ట్ చేశారు.
Similar News
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
News November 21, 2025
బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News November 21, 2025
వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.


