News July 22, 2024
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: మెదక్ ఎస్పీ

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, పొలాల వద్ద రైతులు జాగ్రత్తంగా ఉండాలని చెప్పారు. విపత్కర సమయంలో పోలీస్ కంట్రోల్ నంబర్ 8712657888, డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News February 11, 2025
మెదక్: వేర్వేరుగా నలుగురి ఆత్మహత్య

వేర్వేరుగా నలుగురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో సర్సింలు(38) అప్పులు తీర్చలేక చెరువులో దూకి మృతి చెందగా, చేగుంటలో అనారోగ్యంతో వృద్ధుడు బాలయ్య(79) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరబాద్‌లో ఛత్తీస్ గఢ్ కూలీ రాహుల్ (25) చెట్టుకు ఉరేసుకుని, చిలిపిచేడ్‌లో మంజీరాలో దూకి రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతితో చెందటంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.
News February 11, 2025
మెదక్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోర్లు పొయ్యని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో 9.30మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే జనవరి చివరి వారంకి వచ్చేసరికి 10.94 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు పడిపోవడంతో నీరును పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.
News February 11, 2025
మెదక్: కూలి పనులు దొరకలేదని యువకుడి ఆత్మహత్య

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్(25) పనుల కోసం ఐదు రోజుల క్రితం స్నేహితుడు వద్దకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరకకపోవడంతో మద్యానికి బానిసై దగ్గరున్న డబ్బులు అన్ని ఖర్చు చేశాడు. పని లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.