News September 2, 2024
భారీ వర్షాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 2/4
*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు
Similar News
News September 19, 2024
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ MLAలు
తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం వంటి విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను HYDలో కలిసి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోరుట్ల MLA డా.కల్వకుంట్ల సంజయ్, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.
News September 19, 2024
ఏకలవ్య మోడల్ స్కూల్‌లో స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీలో పాల్గొన్న బండి
స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్లో గురువారం స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్‌తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. స్కూలు ఆవరణలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మొక్క నాటారు.
News September 19, 2024
పెద్దపెల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో కలవెని రాజేశం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొత్తపల్లి-కొలనూరు మధ్యగల రహదారిపై గురువారం హత్య చేశారు. రాజేశం గతంలో రైల్వే శాఖలో పనిచేసి ఇటీవలే రిటైర్మెంట్ అయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.