News August 31, 2024
భారీ వర్షాలు.. ఉమ్మడి ప.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

ఉమ్మడి ప.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 08816-299219 (ప.గో), 18002331077 (ఏలూరు).
Similar News
News December 17, 2025
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్- 1, ఫేజ్ -2 కింద 21,424 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 8,832 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు చెప్పారు.
News December 16, 2025
TDP ప.గో జిల్లా అధ్యక్షుడిగా రామరాజు..?

TDP పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APIIC ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలోనూ TDP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండో సారి కూడా రామరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 16, 2025
పేరుపాలెంబీచ్‌లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్‌లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.


