News September 1, 2024
భారీ వర్షాల పట్ల మంత్రి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరావాస చర్యలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News September 21, 2024
జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్ష
జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.
News September 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గన్నేరువరం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ ఇల్లంతకుంట మండలంలో విద్యార్థికి పాముకాటు.
@ జగిత్యాల రూరల్ మండలంలో గేదెను ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి.
@ 30 ఏళ్ల పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
News September 20, 2024
కరీంనగర్: వరి పంట వైపే మొగ్గు!
కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వేలో ఈ సీజన్లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపినట్లు వెళ్లడైంది. క్షేత్రస్థాయిలో విస్తీర్ణ అధికారుల నుంచి ఏవోలు, ఏడీఏలు, డీఏవో వరకు లక్ష్యాలు నిర్దేశించుకొని చేపట్టిన సర్వేతో సాగు విస్తీర్ణం నిర్ధారణ చేశారు. జిల్లాలో 3,34,606 ఎకరాల సాగు భూమిలో అధిక శాతం 2,73,400 ఎకరాల్లో వరిసాగు చేపట్టినట్లు తెలిపారు.