News April 10, 2025

భారీ వర్ష సూచన.. మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2025

చేగుంట: అడవి పంది ఢీకొని ఒకరి మృతి

image

చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో బైక్‌ను అడవి పంది ఢీకొట్టడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన బొంది భాను(18), తుమ్మల కనకరాజు(27) బైక్ పై రాజుపల్లి నుంచి కొండాపూర్‌కు వెళ్తున్నారు. పోలంపల్లి శివారులో అడవి పంది అడ్డు రావడంతో ఢీకొట్టి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భాను చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.

News April 20, 2025

మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

image

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.

error: Content is protected !!