News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News December 3, 2025
ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 3, 2025
ADB: ఓటుకు నోటు.. చివరి నిమిషం కీలకం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక మలుపు చివరి నిమిషంలో చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ఎన్నికల ముందు రాత్రి మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తారని తెలిపారు. కొందరూ ఓటర్లు పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరూ మద్యం, డబ్బులు ఇస్తే వారికే ఓట్లు వేసే ప్రయత్నం చేస్తారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
News December 3, 2025
బుద్ధారం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం!

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామం బుద్ధారం సర్పంచ్‌గా విడిదినేని శ్రీలత అశోక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కొమ్మురాజు అమృతమ్మ, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామంలోని 12 వార్డులకు గాను, 9 వార్డులకు కూడా ఏకగ్రీవం పూర్తయింది.


