News March 28, 2025
భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. BNSS 163 యాక్ట్ అమలు: సీపీ

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు.
News December 5, 2025
బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.


