News March 28, 2025

భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

image

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 20, 2025

మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

image

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 20, 2025

మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

image

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.

News November 20, 2025

NLR: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని డాక్టర్ BRఅంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతి ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీతో పాటు పీజీ పాసైన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు శనివారంలోపు నెల్లూరు పాత జూబ్లీ ఆస్టిల్ ఆవరణలోని కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సోమవారం ఉదయం 11 గంటల్లోపు డెమోకు హాజరు కావాలని సూచించారు.