News July 10, 2024
భార్యపై అనుమానం.. మల్కాజిగిరిలో మర్డర్

అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. విజయ్‌నగర్ కాలనీకి చెందిన రాజేందర్(45), కృష్ణకుమారి(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి గొడవ పడి విచక్షణ రహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక కృష్ణకుమారి గదిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 6, 2026
HYD: తెలుగు చదవలేకపోతున్నారు..!

10వ తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు చదవడం, రాయడం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ HYD వ్యాప్తంగా స్టడీ ఆన్ మదర్ టంగ్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 వేల శాంపిల్స్ పరిశీలించిన బృందం 74.6% మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడంలేదని తెలిపింది. సర్వేలో 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఇందులో మెజార్టీ విద్యార్థులు మాటలకే పరిమితం అవుతున్నట్లు గుర్తించారు.
News January 6, 2026
హైదరాబాద్ నగరానికి యువీ!

టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నొవాటెల్‌లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తన అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టులో పోటీ పడ్డారు.
News January 6, 2026
బల్దియా.. 3 ముక్కలు అవుతోందయా!

పరిపాలనా సౌలభ్యం కోసం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఉన్న బల్దియాను 6 జోన్ల HYD, 3 జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల బదిలీలు, JCల నియామకాలు జరుగుతున్నాయి. పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశముంది.


