News July 10, 2024
భార్యపై అనుమానం.. మల్కాజిగిరిలో మర్డర్
అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. విజయ్‌నగర్ కాలనీకి చెందిన రాజేందర్(45), కృష్ణకుమారి(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి గొడవ పడి విచక్షణ రహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక కృష్ణకుమారి గదిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 30, 2024
న్యూ ఇయర్.. రాచకొండ సీపీ కీలక ప్రకటన
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో CP సుధీర్ బాబు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 31 DEC రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్(ORR)లో లైట్ వాహనాలకు నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రంక్ & డ్రైవింగ్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.
News December 30, 2024
HYD: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
News December 30, 2024
HYD: న్యూ ఇయర్.. రిసార్టులకు ఫుల్ డిమాండ్..!
న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.