News March 31, 2025
భార్య పుట్టింటికి వెళ్లడంతో.. భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన గుంజ చిన్న రామారావు(28) తన భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
KNR: పప్పు ధాన్యాల సాగుపై రైతుల అనాసక్తి!

ఉమ్మడి KNR జిల్లాలో పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతుంది. మినప, పెసర, కంది, పల్లి, ఇతర పంటలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. వేలాది ఎకరాల్లో సాగయ్యే పప్పు ధాన్యాల పంట నేడు గణనీయంగా తగ్గిపోయింది. యాసంగి సాగు తరువాత మినప, పెసర పంటలు వేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం కూడా వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోని రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే ఈ పంటలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 22, 2025
ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు Dy.CM భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్కుల జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.
News April 22, 2025
భువనగిరి: 23న పేరెంట్ టీచర్స్ మీటింగ్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలో ఈనెల 23న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (PTM) తప్పక నిర్వహించాలని డీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు అందజేయాలన్నారు.