News November 27, 2024
భిక్కనూరు: ‘మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలి’
దేశంలో ఉన్న మాలల సమస్యల పరిష్కారం కోసం, డిసెంబర్ 1వ తేదీ సికింద్రాబాద్ ఫేరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మాలల సింహ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని మాలల సంఘ జిల్లా నాయకుడు నర్ముల రామచంద్రం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సింహ గర్జన ద్వారా మాలలు సత్తా చాటాలన్నారు.
Similar News
News December 10, 2024
ఎల్లారెడ్డి: చిరుత దాడిలో దూడ మృతి?
ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత దాడిలో దూడమృతి చెందినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గెదేలతో పాటు దూడను వ్యవసాయ బావి వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి బావి వద్దకు వద్దకు వచ్చి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో గేదె మృతి చెందిందని సత్యనారాయణ ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు పంచనామ నిర్వహించారు.
News December 10, 2024
అమరవీరుల ఆత్మలు గోషిస్తాయి: అర్బన్ MLA
సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదన పై ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.. సోనియా జన్మదిననా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు గోషిస్తాయని చెప్పుకొచ్చారు.
News December 9, 2024
NZB: కాంగ్రెస్ పెద్దలను కలిసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్
యువజన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వారిని సన్మానించారు. ఎన్నికల్లో గెలిచిన విపుల్ గౌడ్‌ను వారు అభినందించారు.