News March 13, 2025
భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.
Similar News
News November 17, 2025
నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లకు, రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News November 17, 2025
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.
News November 17, 2025
MLG: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క జన్మస్థలమైన తాడ్వాయి మండలం బయక్కపేటలో మంత్రి సీతక్క ఆదివారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం గుడి ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి, ఆలయ అభివృద్ధి పనులు తప్పక చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి, మండల అధ్యక్షుడు దేవేందర్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ తదితరులు పాల్గొన్నారు.


