News September 15, 2024
భీంగల్: నేడు మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నేడు తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీ అధ్యక్షుడిగా భీంగల్‌కు చెందిన బొమ్మ మహేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరి నేడు ఉన్నత పదవీ(పీసీసీ) చేపట్టడం చాలా గొప్ప విషయం అని పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నారు.
Similar News
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
News October 22, 2025
NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.