News September 15, 2024
భీంగల్: నేడు మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నేడు తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీ అధ్యక్షుడిగా భీంగల్‌కు చెందిన బొమ్మ మహేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరి నేడు ఉన్నత పదవీ(పీసీసీ) చేపట్టడం చాలా గొప్ప విషయం అని పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నారు.
Similar News
News October 12, 2024
NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లకు మెడల్స్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మెడల్స్ సాధించారు. మలేషియాలో నిర్వహిస్తున్న 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో శుభారంభం పలికారు. ఇందులో భాగంగా 35+ ఏజ్ గ్రూపులో జరిగిన లాంగ్ జంప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మారే దినేష్ గోల్డ్ మెడల్, యాష్లీ గోపి సిల్వర్ మెడల్ సాధించారు. వీరు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఉన్నారు.
News October 12, 2024
NZB: విషాదం.. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన మల్లారం(55) అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులో గల బెల్లాల్ చెరువులోకి చేపలు పట్టడానికి వల వేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని అన్నారు.
News October 12, 2024
NZB: టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి పై బదిలీ వేటు
నిజమాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొద్ది నెలల క్రితమే నిజామాబాద్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా వచ్చిన విష్ణుమూర్తి అనతి కాలంలోనే అవినీతి ముద్ర వేసుకున్నారు. ఆయన తీరు వివాదాస్పదంగా మారి ఆయనపై సెటిల్ మెంట్లు, బెదిరింపులు, మామూళ్ల వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.