News June 15, 2024
భీంపూర్: పాము కాటుతో మహిళ మృతి

భీంపూర్ మండలంలోని కైరి గూడ గ్రామానికి చెందిన మహిళ పెందూర్ లక్ష్మి(30) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. పెరట్లో పని చేస్తుండగా కాలిపై పాము కాటువేయగా.. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె కుటుంబీకులకు చెప్పారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఖలీల్ తెలిపారు. భర్త ఇది వరకే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు
Similar News
News October 19, 2025
‘పది’లో ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలిచేలా

గతేడాది పదో తరగతిలో జిల్లా 97.95% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే తరహాలో మరింత పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలోని 130 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,354 మంది విద్యార్థులకు ఇప్పటికే అభ్యసన దీపికలు, పోషకాలతో కూడిన బ్రెడ్ అందిస్తున్నారు. రోజూ సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.
News October 18, 2025
పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
News October 17, 2025
ADB: డబ్బులు వసూలు చేసిన ప్రిన్సిపల్ రిమాండ్

ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేసిన బోథ్ కళాశాల ప్రిన్సిపల్ కోవ విఠల్ను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. అనంతా సొల్యూషన్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని 45 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఓ నిరుద్యోగి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.