News September 18, 2024
భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం

భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.
Similar News
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.

ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్కు వాట్సాప్తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.