News February 2, 2025

భీమడోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలోని రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలతో ఆదివారం మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 మధ్య ఉంటుందని, ఎత్తు 5.6, నలుపు జుట్టు, సామాన్య దేహదారుఢ్యం కలిగి ఉందని ఏలూరు రైల్వే SI పి. సైమన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు సెల్ నంబర్ 9989219559 కు సంప్రదించాలని కోరారు.

Similar News

News March 12, 2025

అలా జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: బాండ్

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా తరచుగా గాయాల బారిన పడటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో NZ మాజీ బౌలర్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బుమ్రాపై వర్క్ లోడ్ ఎక్కువగా లేకుండా చూడాలి. టీ20 క్రికెట్ ఆడి, తర్వాత టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేస్తే సమస్యలొస్తాయి. శరీరంలో సర్జరీ అయిన స్థానంలో మరో గాయం అయితే కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే అక్కడ మళ్లీ సర్జరీ చేయించుకోలేం’ అని పేర్కొన్నారు.

News March 12, 2025

BREAKING: KCRను కలిసిన పటాన్‌చెరు MLA

image

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.

News March 12, 2025

ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్

image

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ AIIMSలో చేరిన ఆయన తాజాగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.

error: Content is protected !!