News February 2, 2025
భీమడోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలోని రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలతో ఆదివారం మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 మధ్య ఉంటుందని, ఎత్తు 5.6, నలుపు జుట్టు, సామాన్య దేహదారుఢ్యం కలిగి ఉందని ఏలూరు రైల్వే SI పి. సైమన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు సెల్ నంబర్ 9989219559 కు సంప్రదించాలని కోరారు.
Similar News
News February 9, 2025
రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
News February 9, 2025
సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు

గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.
News February 9, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే

డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్‌కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్‌గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.