News May 2, 2024
భీమదేవరపల్లి: ఎన్ కౌంటర్‌లో వంగర వాసి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్ మాడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి అలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Similar News
News November 2, 2024
WGL: నేటి నుంచి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’
కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ నేటి నుంచి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2నవంబర్ 2024 నుంచి 1 డిసెంబర్ 2024 వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేలా కార్య నిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి ఆదేశించారు.
News November 2, 2024
సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క
MLG’ సచివాలయంలో DRDOలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వచ్చే అయిదు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలను చేశారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, గ్రామాల మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వినియోగించాలని సీతక్క మార్గదర్శనం చేశారు.
News November 2, 2024
పాలకుర్తిలో కమ్ముకున్న పొగ మంచు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈరోజు ఉదయం పొగ మంచు కమ్మేసింది. మండలంలోని పలు గ్రామాల్లో ఓ వైపు చలి, మరోవైపు పొగ మంచు కమ్మేయడంతో అంతా చీకటిగా మారింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు రోడ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. కాగా, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా పొగమంచు కమ్మేయడంతో బయటకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.